వాన బీభత్సం.. రహదారిపై ఒరిగిన భారీ వృక్షం

వాన బీభత్సం.. రహదారిపై ఒరిగిన భారీ వృక్షం

MNCL: బెల్లంపల్లిలో గాలిదుమారంతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పట్టణంలోని సింగరేణి స్టోర్ వద్ద భారీ వృక్షం విరిగి ప్రధాన రహదారిపై అడ్డంగా పడటంతో మంగళవారం రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై ఉన్న చెట్టును తొలగించి, రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరారు