'సీజనల్ వ్యాధులపై జాగ్రత్త ఉండాలి'

'సీజనల్ వ్యాధులపై జాగ్రత్త ఉండాలి'

NZB: సీజనల్ వ్యాధులపై కామారెడ్డి జిల్లా ప్రజలందరూ తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్ సూచించారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని వైద్య అధికారులకు, ప్రజలకు సూచించారు. ప్రజలు అందరూ పరిసరాల అపరిశుభ్రంతో మలేరియా, డెంగీ, ఫైలేరియా వ్యాధులు వస్తున్నాయని తెలిపారు.