విధి నిర్వహణలో గాయపడ్డ కానిస్టేబుల్.. జిల్లా ఎస్పీ పరామర్శ

SRPT: విధి నిర్వహణలో గాయాలైన కోదాడ పట్టణ కానిస్టేబుల్ నరేష్‌ను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నరసింహ పరామర్శించారు. ఈ క్రమంలో అతని అవసరాల దృష్ట్యా ఆర్థిక సాయం అందించారు. విధి నిర్వహణలో ధైర్యంగా ఉండాలని ఎలాంటి అవాంతరాలు వచ్చినా పోలీస్ సిబ్బందికి జిల్లా పోలీస్ అండగా ఉంటుందని తెలిపారు. సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తామన్నారు.