సీజేఐ దళితుడు కాబట్టే దాడి చేశారు: మందకృష్ణ
TG: ఢిల్లీలో రేపటిసభకు పోలీసులు అనుమతివ్వలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సీజేఐకి మద్దతుగా సభ పెట్టాలని భావించామని.. అనుమతి ఇవ్వకపోవడం పౌర హక్కులను హరించడమేనని మండిపడ్డారు. సీజేఐ దళితుడు కాబట్టే దాడి చేశారని ఆరోపించారు. ఢిల్లీకి చెందిన వారు ధర్నా చేస్తే అనుమతి ఇచ్చారని.. ఇతర ప్రాంతాల వారికి అనుమతి ఇవ్వరా అని నిలదీశారు.