'తాగునీటి సమస్యను పరిష్కరించండి'

ASR: అనంతగిరి మండలం పినకోట గ్రామంలో తాగునీటి అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు తెలిపారు. జల్ జీవన్ పథకం ద్వారా మంచినీటి సరఫరా చేసే మోటర్ కాలిపోవడంతో వారం రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అధికారులు స్పందించి మోటర్ మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.