రెండో రోజుకు చేరిన గిరిజనుల నిరసనలు

VZM: తమ గ్రామంలో ఆదాని పవర్ ప్లాంట్ నిర్మించొద్దని వేపాడ మండలం మారిక గ్రామ గిరిజనులు చేస్తున్న నిరసన కార్యక్రమాలు మంగళవారం నాటికి రెండో రోజుకు చేరాయి. ఇందులో భాగంగా ఏపీ రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద వంటా వార్పుతో నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన విరమించలేదని స్పష్టం చేశారు.