ఇండిగో విమానాల రద్దు.. ప్రయాణికులకు ఆర్టీసీ స్లీపర్ బస్సులు

ఇండిగో విమానాల రద్దు.. ప్రయాణికులకు ఆర్టీసీ స్లీపర్ బస్సులు

RR: ఇండిగో విమానాల రద్దు కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ స్లీపర్ బస్సులను ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 2:30కు చెన్నై, బెంగళూరుకు, సాయంత్రం 4 గంటల నుంచి రాజమండ్రి, వైజాగ్, కాకినాడలకు అదనపు బస్సులు నడుస్తాయి. ఎయిర్‌పోర్ట్ అరైవల్ పిల్లర్ నెం.8 వద్ద ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.