VIDEO: మహిళా భవనానికి సమాఖ్య భూమి పూజ
JGL: మల్యాల వాణి విద్యాలయం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల స్థలంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి బుధవారం సర్పంచ్ బొట్ల జయ, MPDO స్వాతి భూమి పూజ నిర్వహించారు. గ్రామంలో మహిళా సంఘాలకు ఇప్పటివరకు సొంత భవనాలు లేకపోవడంతో సమావేశాల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, ఆత్మ గౌరవంతో బతకడానికి ఈ భవనాలు ఎంతో దోహద పడతాయన్నారు.