నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

TPT: పాకాలలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలతో సీఐ చిన్న గోవిందు ఆధ్వర్యంలో కుందేటివారిపల్లి సమీపంలో దాడులు నిర్వహించి, వారి నుంచి రూ.50 వేల విలువైన 5.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి తెచ్చిన గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి పాకాల పరిసరాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.