ఎమ్మెల్యేకు సీఎస్ఐ చర్చి నిర్వాహకులు వినతిపత్రం

HNK: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు సీఎస్ఐ చర్చి నిర్వాహకులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. పాస్టర్ విక్టర్ పాల్ ఆధ్వర్యంలో కలిసి సీఎస్ఐ చర్చి సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.