సత్తాచాటిన భారత షూటర్లు

కజకస్థాన్‌లో జరుగుతున్న ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ శుభారంభం చేసింది. తొలి రోజే నాలుగు పతకాలు దక్కగా.. అందులో గోల్డ్ మెడల్ ఉండటం విశేషం. పురుషుల జూనియర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో కపిల్ విజేతగా నిలిచాడు. 243 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పథకం సాధించాడు.