రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం
NDL: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా, నంద్యాల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో న్యూక్లియస్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి దశ నుంచే రహదారి భద్రత నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని ఆయన స్పష్టం చేశారు.