విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే..?
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,39,112 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 71 మంది స్వామివారిని దర్శించుకున్నారన్నారు. 23 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని, 1174 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.