ఫుడ్ పాయిజన్.. టూరిస్టులకు తీవ్ర అస్వస్థత

ఫుడ్ పాయిజన్.. టూరిస్టులకు తీవ్ర అస్వస్థత

SKLM: ఫుడ్ పాయిజన్ కారణంగా కర్ణాటక ప్రాంతానికి చెందిన సుమారు 20 మంది టూరిస్టులు శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు, ఒడిశా రాష్ట్రంలో క్షేత్రాలను సందర్శించి టెక్కలి మీదుగా బస్సులో తిరిగి వెళ్తుండగా శనివారం వేకువజామున వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిని టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.