JEEలో కాలిక్యులేటర్‌కు అనుమతి లేదు: NTA

JEEలో కాలిక్యులేటర్‌కు అనుమతి లేదు: NTA

జేఈఈ మెయిన్‌లో ఏ రూపంలోనూ కాలిక్యులేటర్‌ను అనుమతించబోమని జాతీయ పరీక్షల సంస్థ స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్‌కు సంబంధించి శుక్రవారం అర్ధరాత్రి వెబ్‌సైట్‌లో పెట్టిన సమాచార పత్రంలో వర్చువల్ కాలిక్యులేటర్ వినియోగించుకోవచ్చని పేర్కొంది. అయితే అది పొరపాటుగా పడిందని.. ఎటువంటి కాలిక్యులేటర్‌ను అనుమతించడం లేదని తేల్చిచెప్పింది.