'కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి'

KMM: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హామీలను అమలు చేయకపోతే కార్మికులు ఉద్యమాలు చేపడతారని హెచ్చరించారు.