సత్యమ్మ తల్లి జాతర ఉత్సవాలు ప్రారంభం
NTR: నందిగామ మండలం అంబారుపేట స్వయంభు సత్యమ్మ తల్లి ఛైత్రమాస జాతర ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అమ్మవారి మూలమూర్తికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వెండి కవచం, పుష్పాలు నూతన వస్త్రాలతో అలంకరించారు. జాతర నేపథ్యంలో దేవాలయ ప్రాంగణాన్ని పూలతో సుందరంగా అలంకరించారు. ఈ ఏర్పాట్లను ఆలయ ఛైర్మన్ మంచాల మాధవరావు, ఈవో సీతారావమ్మ దగ్గరుండి పర్యవేక్షించారు.