VIDEO: ప్రమాదకరంగా మారిన మూలమలుపు
MLG: ఏటూరునాగారం మండలంలోని వట్టివాగు వద్ద ఉన్న మూలమలుపు ప్రమాదకరంగా మారింది. సూచిక బోర్డులు, రిఫ్లెక్టర్లు లేకపోవడంతో ఉదయం, రాత్రి వేళల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగి దట్టంగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రాత్రి పూట ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించాలని ఇవాళ కోరారు.