రేపు బోనాల పండుగ సెలవు

రాష్ట్ర పండుగ బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు,ప్రభుత్వ కార్యాలయాలకు సోమవారం సెలవు ఉండనుంది.ఇవాళ ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజుల సెలవులు వచ్చాయి. తిరిగి 22న స్కూళ్లు,కార్యాలయాలు తెరుచుకోనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బోనాలను రాష్ట్ర పండగగా గుర్తించి ఏటా ఘనంగా బోనాల వేడుకలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.