లక్ష్మీపురంలో బడిబాట కార్యక్రమం

లక్ష్మీపురంలో బడిబాట కార్యక్రమం

NTR: తిరువూరు (M) లక్ష్మీపురంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీఎస్ లక్ష్మీపురం పాఠశాలలో విద్యార్థుల నమోదు కోసం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఫీజులు లేకుండా పూర్తి ఆంగ్ల మాధ్యమంలో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాల సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.