బస్సు కింద పడి విద్యార్థి మృతి

బస్సు కింద పడి విద్యార్థి మృతి

GDWL: ఇటిక్యాల మండలం, శేనగపల్లి గ్రామం సమీపంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. శాంతినగర్‌కు చెందిన ఓ ప్రైవేట్ విద్యాసంస్థ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన అక్క కోసం వెళ్లిన బాలుడు బస్సు కింద పడి మరణించినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.