VIDEO: ఉగ్ర సంబంధాల కేసులో మరో ఇద్దరు అరెస్ట్
NTR: ఉగ్రవాద సంస్థలతో సంబంధాల కేసులో కొత్తగా ఇద్దరిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. HYDకు చెందిన సైదా బేగం, బళ్లారికి చెందిన అబ్దుల్ సలాంను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించగా, కట్టుదిట్టమైన భద్రతతో వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, గతంలో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.