సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సందర్శించిన కలెక్టర్

SDPT: ములుగు మండల కేంద్రంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, రైతు శిక్షణ కేంద్రం నర్సరీని జిల్లా కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంగళవారం కేంద్రంలో కూరగాయలు, పండ్లు, పూలు ఇతరత్రా మొక్కలను విత్తనం దగ్గర నుంచి ఎరువులు వేస్తూ సాంకేతిక పద్ధతితో మొలిచే విధానాన్ని పరిశీలించారు. దేశీ రకం వంగడాలతో నర్సరీలో మొక్కలు పెంచాలని సూచించారు.