దీక్షా దివస్‌పై డాక్యుమెంటరీ ఆవిష్కరణ
TG: HYD తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహాలకు మాజీ మంత్రి KTR పూలమాల వేసి నివాళులర్పించారు. KCR దీక్ష, 2009 నుంచి 2013 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమం, స్వరాష్ట్ర సాధన, గెలుపు, పదేళ్ల సంక్షేమంపై చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. అలాగే కేసీఆర్ ఉద్యమంపై డాక్యుమెంటరీ ప్రదర్శించారు.