అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

కృష్ణా: మచిలీపట్నంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమ రవాణాపై అధికారులు దృష్టి సారించి లారీ లోడు బియ్యాన్ని పట్టుకున్నారు. ఇనకుదురు పోలీసులకు సమాచారం అందడంతో వారు చింతచెట్టు సెంటర్‌కు చేరుకుని పరిశీలించగా, అప్పటికే లారీలో బియ్యం బస్తాల లోడింగ్ చేస్తుండగా పట్టుకున్నారు.