నీటి గుంతలో పడి వ్యక్తి మృతి

MBNR : నీటి గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలంలోని బోడ జానంపేట గ్రామంలో జరిగింది. ఎస్సై లెనిన్ తెలిపిన వివరాల ప్రకారం.. బోడ జానంపేట గ్రామంలో ఓ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు శుక్రవారం రాత్రి గణేష్ నిమజ్జనం చేశారు. ఆ కంపెనికి చెందిన ఆంజనేయులు (32) అనే యువకుడు గుంతలో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.