వెంకటాపురంలో గిడ్డంగుల నిర్మాణ స్థల పరిశీలన
KMM: ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో గిడ్డంగుల నిర్మాణానికి సంబంధించి గురువారం జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఉషా శారద, సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. గిడ్డంగుల నిర్మాణానికి అనుకూలతలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.