విద్యార్థులే ఉపాధ్యాయులుగా
NLG: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కేతేపల్లి మండలం భీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్వపరిపాలన దినోత్సవంను నిర్వహించారు. విద్యార్ధులు ఉపాధ్యాయులగా, అధికారులుగా పాత్రలు పోషించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భిక్షమయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.