తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

TPT: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం పూర్తి కావడానికి 18 గంటల సమయం పడుతుండగా.. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 81,777 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.70 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.