సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించాలి: కలెక్టర్

సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించాలి: కలెక్టర్

JGL: జగిత్యాల రూరల్ మండలం పొలాసలో జరిగిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' గ్రామసభలో కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.