పన్నులు సకాలంలో చెల్లించండి: నిర్మలా జగ్గారెడ్డి

పన్నులు సకాలంలో చెల్లించండి: నిర్మలా జగ్గారెడ్డి

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలో గృహ, వాణిజ్య యజమానులు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని టీజీఐఐసీ ఛైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కమిషనర్‌తో సమావేశమై అభివృద్ధి పనులపై సమీక్షించారు. మార్చి 31లోపు పన్నులు చెల్లించకపోతే పెనాల్టీ ఉంటుందని హెచ్చరించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.