'నెలాఖరులోగా లైఫ్ సర్టిఫికెట్లు అందించాలి'
NZB: ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న ఉద్యోగులు, కార్మికులు లైఫ్ సర్టిఫికెట్లు ఇప్పటి వరకు అందజేయని వారు ఈ నెలాఖారు వరకు మీసేవ కేంద్రాల్లో సమర్పించాలని ప్రాంతీయ భవిష్య నిధి కార్యాలయ సిబ్బంది తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించకపోతే పెన్షన్లు ఆగిపోతాయన్నారు. పెన్షన్ పొందుతున్న బీడీ కార్మికులు, ఇతర కార్మికులు, ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్లను అందజేయాలన్నారు.