విషాదం.. స్కూల్ బస్సు కింద పడి బాలుడు మృతి
BPT: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిజాంపట్నం మండలం హారిస్‌పేటలో స్కూల్ బస్సు కిందపడి ఓ చిన్నారి మృతి చెందాడు. తల్లి ఉద్యోగ నిమిత్తం రేపల్లెకు వెళ్లేందుకు ఓ స్కూల్ బస్సు ఎక్కగా, ఆమె కోసం పరిగెత్తుకుంటూ వచ్చిన బాలుడు జారి బస్సు చక్రాల కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.