సీకే బాబును కలిసిన మురళీమోహన్

చిత్తూరు: మాజీ ఎమ్మెల్యే సీకే బాబును టీడీపీ పూతలపట్టు ఇంచార్జ్ డాక్టర్ మురళీమోహన్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని ఆయన నివాసం వద్ద కలిసి పుష్పగుచ్చం అందజేశారు. పూతలపట్టు ఎమ్మెల్యేగా గెలిపించేందుకు తనకు సహకరించాలని కోరారు. పూర్తిస్థాయి సహకారంతో మురళీమోహన్‌ను గెలిపించుకుంటామని ఈ సందర్భంగా సీకే బాబు తెలిపారు.