రేపు 91 పంచాయతీలకు ఎన్నికలు…!
జనగాం: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడు మండలాలకు చెందిన 91 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు రేపు జరగనున్నాయి. దేవరుప్పల మండలంలో 32, పాలకుర్తి మండలంలో 38, కొడకండ్ల మండలంలో 21 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 800 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. 597 మంది ఓపీవోలు కలిపి మొత్తం 1,194 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.