ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్ని రాజకీయ ఒడిదొడుకులు ఎదుర్కొన్నా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మహానేత సోనియా గాంధీ అన్నారు.