ప్రజల కోసమే ప్రభుత్వం పని చేస్తుంది: ఎమ్మెల్యే
MBNR: ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పని చేస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హన్వాడ మండలం గుడి మల్లాపూర్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల కింద రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.