సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: SP

ADB: బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 20 మంది అర్జీలను ఆయన స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.