VIDEO: వెలవెలబోతున్న పంట పొలాలు..!

VIDEO: వెలవెలబోతున్న పంట పొలాలు..!

SRPT: నడిగూడెం మండలం వేణుగోపాలపురం గ్రామంలో సాగునీటి కష్టాలు తారా స్థాయికి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా వేధిస్తున్న లో-ఓల్టేజీ సమస్యతో రైతన్నలు అల్లాడిపోతున్నారు. సాగునీరు పుష్కలంగా ఉన్నప్పటికీ, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక మోటర్లు నడవక పోవడంతో చేతికి వచ్చిన పంట కళ్లముందే ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.