SLBC సొరంగంలో నిలిచిన సహాయక చర్యలు

NGKL: శ్రీశైలం ఎడమ గట్టు SLBC సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలు బుధవారం తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రమాదం జరిగిన 66 రోజులైనా గల్లంతైన ఆరుగురి ఆచూకీ లభించలేదు. డీ1 ప్రాంతాన్ని ప్రమాద క్షేత్రంగా గుర్తించడంతో సిబ్బంది పని చేయడం కష్టంగా మారింది. సాంకేతిక కమిటీ నివేదిక అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.