సత్యసాయికి 9.2 కిలోల బంగారు విగ్రహం
ATP: పుట్టపర్తి శ్రీ సత్యసాయి శత జయంతి వేడులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 9.2 కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహాన్ని తయారు చేసి, 31.8 అడుగుల ఎత్తయిన వెండి రథంలో విగ్రహాన్ని ప్రతిష్టించి వేద మంత్రోచ్ఛరణలు, సాయి నామస్మరణల మధ్య పురవీధుల్లో ఊరేగించారు. రథం తయారీలో 180 కిలోల వెండి, కిలో బంగారు పూతను వాడడం విశేషం. కాగా ఈ వేడుకల్లో ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు.