ఆటోనగర్ రైల్వే గేటు వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం
గుంటూరు GRP పరిధిలోని ఆటోనగర్ రైల్వే గేటు వద్ద శనివారం ఉదయం గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సుమారు 65 ఏళ్ల వయసున్న మృతుడు తెల్ల గళ్ల చొక్కా, నల్ల ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి శవాగారానికి తరలించగా, వివరాలు తెలిసిన వారు గుంటూరు GRP పోలీసులను సంప్రదించాలని కోరారు.