శక్తి సదన్ కేంద్రాన్ని పరిశీలించిన కార్యదర్శి

BDK: జిల్లాలో నిరాధారణకు గురైన మహిళలు, బాలికల కోసం ఏర్పాటు చేసిన శక్తి సదన్ కేంద్రాన్ని మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మహిళలకు అందిస్తున్న ఆహారం, ఆరోగ్యం, సంరక్షణ తదితర విషయాలపై నిర్వాహకులతో చర్చించారు. కేంద్రంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైన తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.