VIDEO: చివరికి అందని నీరు.. ఎండుతున్న పంట పొలాలు

VIDEO: చివరికి అందని  నీరు.. ఎండుతున్న పంట పొలాలు

KNR: శంకరపట్నం మండలంలో సాగు చేసిన వరి పంటలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎస్సారెస్పీ కాలువకు నీటి సరఫరా నిలుపుదల చేస్తే అన్నదాతలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని వాపోతున్నారు. జనవరి 1 నుంచి మార్చి 31 వరకు కాలువ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని గతంలో అధికారులు ప్రకటించారు. దీంతో చివరి దశలో పంటలు నీరు అందక ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు.