'కల్లు విషయంలో ఐదుగురు విడిసీ సభ్యులపై కేసు నమోదు'

'కల్లు విషయంలో ఐదుగురు విడిసీ సభ్యులపై కేసు నమోదు'

ADB: తానూరు మండలం మహలింగిలో కల్లు అమ్మకం విషయంలో సోమవారం వీడీసీ సభ్యులకు, కల్లు విక్రయదారుడి మధ్య గొడవ జరిగింది. కొందరు వీడీసీ సభ్యులు తన కుటుంబాన్ని దూషించి దాడిచేశారని సాయినాథ్ గౌడ్ సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా సాయినాథ్ గౌడ్ ఫిర్యాదు మేరకు వీడీసీకి చెందిన ఐదుగురిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.