తిరువూరులో సీసీ రోడ్డును ప్రారంభించిన ఎంపీ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని 17వ వార్డులో రూ. 23 లక్షల వ్యయంతో నిర్మించిన షాదీఖానా సీసీ రోడ్డును ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిండంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.