17 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
KKD: జగ్గంపేటలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 మందిపై కేసులు నమోదయ్యాయి. గండేపల్లి పరిధిలో 13 మందిపై, జగ్గంపేట పరిధిలో 4 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరిలో 11 మందికి రూ. 10 వేల చొప్పున జరిమానా విధించగా, మరో ఆరుగురికి 3 రోజుల జైలు శిక్ష పడింది. వారిని పెద్దాపురం సబ్ జైలుకు తరలించినట్లు సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ బుధవారం తెలిపారు.