విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించిన ముస్లింలు

ప్రకాశం: కనిగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడికి గురువారం రెండో రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ముస్లింలు పాల్గొన్నారు. అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, కనిగిరి ప్రాంతంలో హిందూ, ముస్లింలు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఐక్యతగా పండుగలను నిర్వహించుకుంటామన్నారు.