రేపు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలి: డీఈవో రామారావు

NRML: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం కోసం శుక్రవారం జిల్లాలో తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించాలని డీఈవో రామారావు తెలిపారు. జిల్లాలోని ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, విద్యావేత్తలు విలేజ్ డిఫెన్స్ కమిటీ (VDC) సభ్యులతో కలిసి ప్రతి కూడలిలో సమావేశం నిర్వహించాలన్నారు.