మాక్ అసెంబ్లీకి డోన్ విద్యార్థి ఎంపిక

మాక్ అసెంబ్లీకి డోన్ విద్యార్థి ఎంపిక

నంద్యాల: డోన్‌లోని డా.బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థిని సూసన్న మాక్ అసెంబ్లీకి ఎంపికయ్యారు. ఈ నెల 26న అమరావతి అసెంబ్లీలో ఈ బాలిక అడుగుపెట్టనుంది. మాక్ అసెంబ్లీకి ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతానని విద్యార్థి సూసన్న తెలిపింది.